అక్షరటుడే, మప్కాల్ : KCR, Bajireddy Birthday Celebrations | జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
KCR, Bajireddy Birthday Celebrations | సారంగపూర్‌లో..
మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR), రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Baji Reddy Govardhan) జన్మదిన వేడుకలను మంగళవారం సారంగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సారంగపూర్ జడ్పీహెచ్ఎస్లో ప్రైమరీ విద్యార్థులకు మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ ఆధ్వర్యంలో 50మంది విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. అలాగే పండ్లు అందజేశారు. కార్యక్రమంలో రాంనగర్ అంశాల స్వామి, ఉప సర్పంచ్ స్వామి, శాస్త్రి నగర్ బీఆర్ఎస్, ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పరశురాం గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో..
అక్షరటుడే, ఆర్మూర్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో (Government Hospital) కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఅర్ఎస్ కౌన్సిలర్లు నదీం, పృథ్వీ, అజీం, సీనియర్ నాయకులుసుంకరి రవి, మీరా శ్రవణ్, మందుల పోశెట్టి, ఎస్ఆర్ రమేష్, ఆర్మూర్ మండల యువజన అధ్యక్షుడు అగ్గు క్రాంతి, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జన్నెపల్లి రంజిత్, మైనారిటీ నాయకులు మాలిక్ బాబా, ఆరిఫ్ ఖాన్, ఖరీం, రామ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ముప్కాల్‌లో..
అక్షరటుడే, ముప్కాల్: మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
గాంధారిలో..


