అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని(Bodhan Government Hospital) శనివారం కాయకల్ప అధికారులు బృందం తనిఖీ చేసింది. ఆస్పత్రిలోని వార్డులను, డిస్పెన్షరీలో మందులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్వచ్ఛత, సదుపాయాలు, ఇన్ఫెన్షల్ కంట్రోల్(Infantile control), పారిశుధ్య, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర 40 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వివరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాహుల్ (Hospital Superintendent Rahul) తదితరులున్నారు.
