అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవతి (MLC Kavitha) స్పందించారు.
‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘కర్మ హిట్స్ బ్యాక్’ (Karma hits back) అంటూ తన ‘ఎక్స్’లో ఖాతాలో రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. బీఆర్ఎస్ పెద్దలను ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress Party candidate Naveen Yadav) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (BRS candidate Maganti Sunitha) రెండో స్థానంలోనే ఆగిపోయారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
