HomeతెలంగాణTelangana Jagruti | జాగృతి బలోపేతంపై కవిత దృష్టి.. ఐటీ విభాగం కార్యవర్గం నియామకం

Telangana Jagruti | జాగృతి బలోపేతంపై కవిత దృష్టి.. ఐటీ విభాగం కార్యవర్గం నియామకం

Telangana Jagruti | తెలంగాణ జాగృతి ఐటీ సెల్​ రాష్ట్ర కార్యవర్గాన్ని కల్వకుంట్ల కవిత నియమించారు. సంస్థ అభివృద్ధిపై ఆమె ఫోకస్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Jagruti | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆ సంస్థ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆమె చర్యలు చేపడుతున్నారు.

కవిత కొంతకాలంగా బీఆర్​ఎస్ (BRS)​ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హరీశ్​రావు, సంతోష్​రావుపై ఆమె అనేక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెన్షన్​కు గురయ్యారు. దీంతో బీఆర్​ఎస్​ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను ఇంకా శాసనమండలి ఛైర్మన్​ ఆమోదించలేదు. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. పలుమార్లు ఆమె మాట్లాడుతూ.. అవసరం అయితే పార్టీ పెడతానని ప్రకటించారు.

Telangana Jagruti | కొత్త పార్టీ లేనట్లేనా..

కవిత పార్టీపై ఊహగానాలు వచ్చినా.. ఆమె మాత్రం ఇటీవల జాగృతిపైనే దృష్టి సారించారు. సింగరేణిలోని ఓ కార్మిక సంఘంతో జాగృతి భాగస్వామ్యం అయింది. అంతేగాకుండా బీసీ రిజర్వేషన్లపై సైతం ఆమె పోరాటం చేస్తున్నారు. బీసీ బంద్​లో ఆమె తన కుమారుడు ఆదిత్యతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట (Jagruthi Janam Bata) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జాగృతి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ఐటీ సెల్​ రాష్ట్ర కార్యవర్గాన్ని కవిత నియమించారు.

Telangana Jagruti | రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరే..

తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పశుపతినాథ్ గజవాడ నియమితులయ్యారు. జనరల్ సెక్రెటరీగా ఎల్​కె అశోక్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజేష్ గౌడ్, కార్యదర్శులుగా సంజయ్, కుమ్మరి రమేష్, ముఖేష్ గౌడ్, కోశాధికారిగా ఆర్ కిరణ్, మహిళా ప్రతినిధిగా పద్మ, అధికార ప్రతినిధిగా పి శక్తి స్వరూప్ సాగర్, మహిళా విభాగం కో ఆర్డినేటర్​గా అన్నపూర్ణ, పీఆర్​వోగా విజయ్ రాజా జెట్టి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్​గా ఎ రాజు, సభ్యత్వ కో ఆర్డినేటర్​గా డి.రవి, మీడియా కో ఆర్డినేటర్​గా బి.సురేష్​ను కవిత నియమించారు.

Telangana Jagruti | తిరుపతిలో పూజలు

కవిత జాగృతి జనంబాట కార్యక్రమం విజయవంతం కావాలని తిరుపతి (Tirupati)లో ప్రత్యేక పూజలు చేశారు. తన భర్తతో కలిసి ఆదివారం శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో సైతం పూజలు చేశారు. హాథీరామ్ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బీజేపీ కూడా బంద్​లో పాల్గొనడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగివచ్చి బీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతుందని చెప్పారు. హాథీరామ్ మఠాన్ని కూల్చివేయవద్దు ఆమె కోరారు. మఠంలో దక్షిణ భారత సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ ఆ మఠాన్ని అభివృద్ధి చేసి బంజారాలకు సాంస్కృతిక వేదికగా అభివృద్ధి చేయాలని కవిత సూచించారు.