Homeతాజావార్తలుKalvakuntla Kavitha | బస్​ ఛార్జీల పెంపుపై కవిత ఆగ్రహం

Kalvakuntla Kavitha | బస్​ ఛార్జీల పెంపుపై కవిత ఆగ్రహం

హైదరాబాద్​ సిటీ బస్సుల్లో టికెట్​ రేట్ల పెంపుపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డికి పేదలంటే ఎందుకంత కోపమని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సిటీ (hyderabad City) బస్సుల ఛార్జీలను శనివారం ఆర్టీసీ పెంచిన విషయం తెలిసిందే.

బస్సు ఛార్జీల పెంపుపై (Bus Fare Hike) కవిత మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. ‘‘సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి గారు?. మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్​ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారు. ఇప్పుడు బస్ చార్జీలను అమాంతం పెంచేశారు.. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రీన్ జర్నీ (green journey) పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kalvakuntla Kavitha | రేపటి నుంచి అమలులోకి..

ఆర్టీసీ సిటీ బస్సుల (RTC City Buses) ఛార్జీలను పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతించడంతో సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు టికెట్​ ధరపై రూ.5 పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 4వ స్టేజీ నుంచి రూ.10 అదనంగా ఛార్జీ చేయనున్నారు. మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో సైతం రేట్లు పెంచారు. మొదటి స్టేజీకి రూ.5, రెండోస్టేజీ తర్వాత రూ.10 చొప్పున టికెట్​ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్త ధరలు ఈ నెల 6 నుంచి అమలులోకి రానున్నాయి.