Homeజిల్లాలునిజామాబాద్​Kalvakuntla Kavitha | నీలకంఠేశ్వర ఆలయంలో కవిత పూజలు

Kalvakuntla Kavitha | నీలకంఠేశ్వర ఆలయంలో కవిత పూజలు

నిజామాబాద్​ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kalvakuntla Kavitha | నిజామాబాద్​ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం లో (Neelakanteshwara Temple) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు కార్తీక పౌర్ణమి (Kartika Purnima), కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినట్లు ఆమె చెప్పారు. స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. మొంథా తుపానుతో (Montha Cyclone) రాష్ట్రంలో అనేక నష్టం జరిగిందన్నారు. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని ఆమె సూచించారు. మంచి రోజులు వస్తాయని చెప్పారు.