అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mlc kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కంటతడి పెట్టారు. సోమవారం ఆమె తన రాజీనామాపై సభలో మాట్లాడారు. ఎనిమిది ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే కక్షగట్టి పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగిందన్నారు. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించే వారిపట్ల వివక్ష కొనసాగిందన్నారు.
Mlc kavitha | తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలోకి..
తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చానని కవిత తెలిపారు. బీఆర్ఎస్లో చేరకముందే జాగృతిని స్థాపించాని.. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కావాలని చర్చలు జరిగాయన్నారు. అయితే పార్టీ ఒంటరిగా పోటీకి నిర్ణయించిందన్నారు. 2014 ఎన్నికల్లో తనను పిలిచి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. తాను ఎవరినీ టికెట్ అడగలేదని చెప్పారు. పదవుల కోసం తాను టీఆర్ఎస్లోకి వెళ్లలేదన్నని భావోద్వేగానికి లోనయ్యారు.
Mlc kavitha | పార్టీ చెప్పడంతోనే ఎంపీగా పోటీ
పార్టీ చెప్పడంతో ఎంపీగా పోటీ చేసి గెలిచానన్నారు. అయితే మొదటి రోజు నుంచే తనను అడ్డుకోవడానికి కుట్ర చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలను నిరుత్సాహ పరచకూడదనే నవ్వుతూ పని చేశానని చెప్పారు. ప్రజల కోసమే తాను పని చేశానని, కాంట్రాక్టర్లు, పైరవీకారులు తన వద్దకు రాలేదన్నారు. అయినా బీఆర్ఎస్ తనకు అండగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
View this post on Instagram