అక్షరటుడే, హైదరాబాద్: ‘Kavitha sensational comments | జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత తన పుట్టింటి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి అల్లుడి ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పరోక్షంగా కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా తాను ఢిల్లీలోని పార్లమెంటులో కొట్లాడుతూ యావత తెలంగాణ ప్రజల గళం వినిపించానని గుర్తుచేశారు.
అక్కడ తాము కష్టపడుతుంటే.. ఇక్కడ వీరు (కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర భారాస నేతలు) ఏసీ గదుల్లో కూర్చుని ఎంజాయ్ చేసేవారని విమర్శించారు. తాము ఓవైపు తెలంగాణ కోసం పోరాడుతుంటే.. ఇక్కడ వీరు కేసీఆర్ పంచన చేరి, పిచ్చి వేషాలు వేసేవారని అన్నారు. తాను తెలంగాణ కోసం పోరాడానని, తనను ఎవరైనా విమర్శిస్తే.. ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు.
Kavitha sensational comments | తన భర్త జోలికి వస్తే..
తన కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. పదేళ్లలో ఎన్నడూ కూడా రాజకీయాల్లో తన భర్త తలదూర్చలేదన్నారు. ఇప్పుడు తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. తన భర్త జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.