అక్షరటుడే, హైదరాబాద్: Kavitha resignation | తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించింది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ Legislative Council Chairman గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 6) నోటిఫికేషన్ విడుదల చేశారు. కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు గుత్తా ప్రకటించారు.
Kavitha resignation | రాజీనామాపై పునరాలోచించుకోవాలని
భారాస నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీ వల్ల లభించిన పదవి తనకు వద్దంటూ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు రిజైన్ లెటర్‌ను కవిత పంపించి ఆమోదం తెలపాలని విన్నవించారు.
కాగా, రాజీనామాపై పునరాలోచించుకోవాలని సోమవారమే కవితకు మండలి ఛైర్మన్ సూచించారు. అయినప్పటికీ కవిత వెనక్కి తగ్గలేదు. జనవరి 5, 2026 న మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా.. మరోసారి ఛైర్మన్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. అన్ని విధాలుగా ఆలోచించే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఛైర్మన్ ఆమోదం తెలిపారు.
నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి భారాస తరఫున కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ, పార్టీ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దీంతో ఆ పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ హోదా కూడా తనకు అవసరం లేదని ఆమె పదవికి రాజీనామా చేశారు.