అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha | సిద్దిపేట జిల్లా(Siddipet District) వర్గల్లో గల జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం సందర్శించారు.
దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత(Kavitha)కు జాగృతి కార్యకర్తలు, అభిమానులు, ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి(Vargal Saraswati Temple) నవరాత్రి ఉత్సవాల సమయంలో రావడం తన అదృష్టం అన్నారు. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అమ్మాయిలందరూ చదువుల్లో రాణించాలని ఆమె అన్నారు.