అక్షరటుడే, వెబ్డెస్క్ : Ande Sri | ప్రముఖ కవి, రచయి అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా.. ఆయన మృతదేహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నివాళులు అర్పించారు.
అందెశ్రీ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం లాలాపేట్ జయశంకర్ స్టేడియానికి తరలించారు. కల్వకుంట్ల కవిత ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక పోరాటంలో ఆయన పోషించిన పాత్రను కవిత గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
