అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీలో చేరితో మంచి పోస్ట్ ఇస్తామన్నారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం కవిత మీడియాతో మాట్లాడారు. ఇటీవల మహేశ్ కుమార్ గౌడ్ (PCC president Mahesh Kumar Goud) చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్‌లోకి వస్తానంటే తాను వద్దనని చెప్పారు. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. తాను కాంగ్రెస్‌లో చేరతానని అనలేదన్నారు. కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. మహేశ్‌కుమార్ గౌడ్ తమ పార్టీ చేరితో మంచి పోస్టు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరుతానని అన్నట్లు బద్నాం చేయొద్దని ఆమె కోరారు.
Kalvakuntla Kavitha | సృజన్‌రెడ్డిని కాంట్రాక్టర్ చేసిందే హరీశ్‌రావు
మాజీ మంత్రి హరీశ్‌రావుపై మరోసారి కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల బొగ్గు కుంభకోణంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బావమరిది సృజన్‌రెడ్డికి గనులు కేటాయించడానికి సైట్ విజిట్ విధానం తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు హరీశ్‌రావు, కేటీఆర్ చిన్న చేప సృజన్ రెడ్డి చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతున్నారని పేర్కొన్నారు. నైనీ కోల్ మైన్స్ రూ.25 వేల కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. మేఘా కృష్ణారెడ్డిని కాపాడటానికి గుంటనక్క హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సృజన్ రెడ్డికి వచ్చింది రూ.250 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. సృజన్ రెడ్డిని కాంట్రాక్టర్‌గా చేసిందే హరీశ్‌రావు అని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో సృజన్‌రెడ్డికి రెండు గనులు వచ్చాయని తెలిపారు.