అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. త్వరలో రాష్ట్రంలో మరో రాజకీయ శక్తి రాబోతుందని ప్రకటించారు. ఆమె ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
దీంతో కవిత తీసుకోబోయే నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కవిత ఎప్పుడు పార్టీ పెడతారా.. పార్టీ పేరు.. ఎవరెవరిని కలుపుకుని ముందుకు సాగుతారనే చర్చ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తుపై ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి (MLA Malreddy Rangareddy) రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా.. గతంలో మల్రెడ్డి రంగారెడ్డి చెప్పినట్లుగానే.. దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారని చేరారు.
Read also..: Mlc kavitha | శాసన మండలిలో కవిత కంటతడి.. పదవుల కోసం ఎప్పుడూ తాపత్రయ పడలేదని భావోద్వేగం..