Homeతాజావార్తలుKavitha Janam Bata | సబితా ఇంద్రారెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు

Kavitha Janam Bata | సబితా ఇంద్రారెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు చెరువులను కబ్జా చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైడ్రా ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Janam Bata | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై (Sabita Indra Reddy) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు.

మహేశ్వరంలో (Maheshwaram) ఆమె అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారన్నారు. కబ్జాలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

జాగృతి జనంబాట కార్యక్రమంలో (Jagruti Janambata program) భాగంగా కవిత శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం సమాజంలో మార్పు కోసం జాగృతి పని చేస్తుందని చెప్పారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని, సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.

Kavitha Janam Bata | ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్​ మార్పు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో (Serilingampalli constituency) అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయని కవిత అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువుల కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తామన్నారు. తొమ్మిదిరెట్ల గ్రామంలో ఆర్ఆర్​ఆర్​ అలైన్​మెంట్​​ను నాలుగు సార్లు మార్పు చేశారని చెప్పారు. సీఎం రేవంత్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి భూములు ఉన్నందుకు అలైన్​మెంట్​ మార్చారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ నాయకుల భూములు కూడా అక్కడ ఉన్నాయన్నారు. అలైన్​మెంట్​ మార్పుపై తాను కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీకి లేఖ రాస్తానని చెప్పారు. రీ సర్వే జరిపి పేద రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.