అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె కొత్త పార్టీ పెడుతారనే వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం ఆమె భారీ కాన్వాయ్‌తో చింతమడక (Chintamadaka)కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ (BRS)ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), సంతోష్‌రావు హస్తం ఉందని ఆరోపించారు.
ఈ క్రమంలో పార్టీ ఆమెపై వేటు వేసింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేసింది. దీంతో కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను ఇంకా శాసనమండలి ఛైర్మన్ ఆమోదించలేదు.
Kavitha | బతుకమ్మ వేడుకలకు..
కవిత కొత్త పార్టీ పెడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చన్నారు. అయితే తాను పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించట్లేదని చెప్పారు.
కాగా బతుకమ్మ వేడుకల్లో (Bathukamma Celebrations) పాల్గొనడానికి ఆదివారం ఆమె తన స్వగ్రామం చింతమడక వెళ్లారు. భారీ కాన్వాయ్‌తో ఆమె చింతమడకకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
బతుకమ్మ వేడుకల కోసం కాకుండా.. తన బలం చూపడానికి ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. తన స్వగ్రామం నుంచి కొత్త రాజకీయ జీవితం ప్రారంభించేలా ఆమె ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Kavitha | సిధారెడ్డితో భేటీ
సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారులు నందిని సిధారెడ్డిని కవిత మర్యాద పూర్వకంగా కలిశారు. చింతమడకకు వెళ్తున్న క్రమంలో అల్వాల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మరి కలవడం గమనార్హం.
కవిత అడుగుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హరీశ్‌రావు నియోజకవర్గం అయిన సిద్దిపేట నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడానికి చింతమడక వెళ్లారని చర్చ జరుగుతోంది.
కాగా ఆమె చింతమడకలో జరిగిన ఎంగిలపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
[…] Kavitha | భారీ కాన్వాయ్‌తో చింతమడకకు కవిత.. … […]