అక్షరటుడే, కామారెడ్డి: Telangana Jagruti | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Telangana Jagruti President Kavitha) చేపట్టిన జనంబాట కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్నట్లు జాగృతి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈనెల 27న నిజాంసాగర్ మండలం నుండి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో (Kamareddy constituency) జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత పర్యటన ఉంటుందన్నారు. 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాలు, మేధావులతో కమిటీగా సమావేశమవుతారని పేర్కొన్నారు.
జనంబాట కార్యక్రమాన్ని (Janambata program) ప్రజలు, కవిత అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ సలీం, రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షుడు కొట్టాల్ యాదగిరి, కామారెడ్డి జిల్లా జాగృతి యూత్ అధ్యక్షుడు అధిల్, జుక్కల్ నియోజకవర్గ జాగృతి ఇన్‌ఛార్జి రాజశేఖర్, జుక్కల్ నాయకులు బాల్‌రాజ్, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఎండీ అల్తాఫ్, సురేందర్ రావు, జొన్నల వినోద్, జొన్నల రాము పాల్గొన్నారు.
