అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha Forward Block Win | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఖాతాలో ఒక మున్సిపాలిటీ చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జాగృతి నేరుగా పోటీ చేయలేదు. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి జాగృతి అభ్యర్థులు బరిలో దిగారు. జాగృతితో పాటు వేరే పార్టీల్లో టికెట్ రాని వారు సైతం రెబల్‌గా ఈ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేశారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (All India Forward Block) కైవసం చేసుకుంది. 10 వార్డులకు గాను 8 వార్డుల్లో ఈ పార్టీ విజయం సాధించడం గమనార్హం. అన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా.. వడ్డేపల్లిలో మాత్రం ఫార్వార్డ్ బ్లాక్ గెలుపొందడం గమనార్హం. దీంతో జాగృతి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Kavitha Forward Block Win | జహీరాబాద్‌లో హంగ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ (Zaheerabad Municipality)లో హంగ్ ఏర్పడింది. మొత్తం 37 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, ఇండిపెండెట్లు 3 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం, స్వతంత్రుల మద్దతులో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అలంపూర్, దేవరకద్ర, కేసముద్రం మున్సిపాలిటీలో సైతం హంగ్ ఏర్పడింది. అలంపూర్‌లో చెరో ఐదు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపొందాయి.