అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Issue | బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తర్వాత, కల్వకుంట్ల కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో తల్లి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సతీమణి శోభ.. కుమార్తె నివాసాన్ని సందర్శించడం అనూహ్యంగా మారింది. గురువారం రాత్రి (సెప్టెంబర్ 11) కవిత భర్త అనిల్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శోభ.. కవిత ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా తల్లి–కుమార్తె మధ్య ప్రత్యేకంగా మంతనాలు జరిగినట్టు పార్టీ వర్గాల సమాచారం. శోభ (Kalvakuntla Shobha), “కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండాలి.. కాలమే సమాధానాలు ఇస్తుంది,” అంటూ కవితకు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.
Kavitha Issue | గత వారం వేడుకకు దూరంగా…
ఇదిలా ఉంటే, కవిత (Kalvakuntla Kavitha) కుమారుడి పుట్టినరోజు వేడుకకు (సెప్టెంబర్ 5) శోభ హాజరుకాలేకపోవడం గమనార్హం. పార్టీ నుంచి కవితపై సస్పెన్షన్ (సెప్టెంబర్ 2) అమలైన మూడు రోజులకే జరిగిన ఈ కుటుంబ వేడుకకు ఆమె దూరంగా ఉండడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే, మనవడికి కొత్త బట్టలు, పూజా వస్తువులు పంపినట్టు సమాచారం. ఆ వేడుకకు దూరంగా ఉండి, అల్లుడి పుట్టినరోజుకు హాజరుకావడం వల్ల కల్వకుంట్ల ఇంట్లో శాంతి చర్చలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు జనరల్ డిబేట్లోకి వచ్చాయి. ఇటీవల కవిత, తన సొంత పార్టీ నేతలైన హరీశ్ రావు (Harish Rao), సంతోష్ కుమాkH;[ (Santosh Kumar) తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, “వారి వల్లే పార్టీకి, కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోంది” అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత క్రమశిక్షణకు విరుద్ధమని భావించి ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది బీఆర్ఎస్ నాయకత్వం. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో శోభ, కవితను కలవడం ఒక వివేకబద్ధమైన కుటుంబ దౌత్యంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కుటుంబసభ్యుల మధ్య పునఃసంధానం, కవితకు మద్దతు, లేదా పార్టీకి తిరిగి మార్గం చూపే ప్రయత్నమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు బీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ, రాష్ట్ర రాజకీయ విశ్లేషణల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.