అక్షరటుడే, వెబ్డెస్క్: Bus Fire Accident | కర్నూలు (Kurnool) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44 పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ (Vemuri kaveri Travels) బస్సులో మంటలు చెలరేగడంతో సుమారు 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 3:00 నుండి 3:30 గంటల మధ్య చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ముందు భాగాన్ని ఒక బైక్ ఢీకొట్టడం వల్ల బస్సు డీజిల్ ట్యాంకు దెబ్బతిన్నది. దీంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందడం జరిగింది.దీంతో కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు దూకారు. సుమారు 12–15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి గాయాలు అయ్యాయి.
Bus Fire Accident | మంటల్లో కుటుంబం..
ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేశ్ (35), అనూష (30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనమయ్యారు. బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికితీసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించమని, ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరపమని అధికారులకు ఆదేశించారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఏపీ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి ప్రధాన కారణంగా బస్సు ఫిట్‌నెస్ (Fitness), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు ముగిసినప్పటికీ ట్రావెల్స్ యాజమానులు బస్సును వినియోగించటం, అలాగే డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి అని అంటున్నారు. బస్సు ఫిట్‌నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉండగా, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ వ్యాలిడీ గతేడాదే ముగిసింది. అయినప్పటికీ బస్సుని నిబంధనలకి విరుద్ధంగా నడిపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి చెందారు.
