Homeఆంధప్రదేశ్Kavali TDP MLA | కావలి ఎమ్మెల్యే సైబర్ మోసానికి బలి.. రూ.23 లక్షలు యూపీఐ...

Kavali TDP MLA | కావలి ఎమ్మెల్యే సైబర్ మోసానికి బలి.. రూ.23 లక్షలు యూపీఐ ద్వారా మాయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kavali TDP MLA | సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ సైబ‌ర్ మోసాల‌కి (cyber frauds) బ‌ల‌వుతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి (MLA Krishna Reddy) సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 23.16 లక్షలు యూపీఐ ద్వారా దశలవారీగా మాయమయ్యాయి. ఆగస్టు 22న ఆయనకు వచ్చిన ఓ ఫేక్ ఆర్టీఏ లింక్‌ను నమ్మి క్లిక్ చేసిన ఎమ్మెల్యే… అది తన కంపెనీ వాహనాల బకాయిలు అనుకున్నారు. కానీ అదే అతని సిమ్ కార్డ్ బ్లాక్ కావడానికి కారణమైంది. వెంటనే స్పందించిన ఆయన, సిమ్ సమస్య పరిష్కరించేందుకు హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించారు.

Kavali TDP MLA | సైబ‌ర్ కేటుగాళ్ల వ‌ల‌లో..

25 రోజుల తర్వాత సిమ్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. కానీ అదే సమయంలో అసలు మోసం బయటపడింది. ఆయనకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి (ఆగ‌స్ట్‌ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు) యూపీఐ ద్వారా రూ.23,16,009 రూపాయలు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఆయన కంపెనీ సిబ్బంది ద్వారా ఈ విష‌యం ఆలస్యంగా తెలిసింది. వెంటనే ఆయన స్పందించి, కావలి పోలీసులకు (Kavali Police) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవల కాలంలో ఏపీ మంత్రి నారాయణ అల్లుడు, కాకినాడ ఎంపీలు Kakinada Mp కూడా సైబర్ మోసాలకు బలయ్యారు. అధికారులతో సహా ప్రజలు కూడా ఫేక్ లింకులు, APK ఫైల్స్, అనుమానాస్పద వాట్సాప్ మెసేజులపై ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సామాన్యులే కాదు ప్ర‌ముఖులు కూడా ఇలా సైబ‌ర్ కేటుగాళ్ల వ‌ల‌లో చిక్కుతుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మీ ఫోన్‌కు వచ్చే అనుమానాస్పద లింకులు, ఫైళ్లను నొక్కకండి. బ్యాంకింగ్, ఆధార్, ఆర్టీఏ, లేదా ఫోన్ కంపెనీ పేరుతో వచ్చే మెసేజ్‌లను గుర్తించండి. ఏవైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌ ద్వారా ధృవీకరించండి.

Must Read
Related News