HomeUncategorizedKatrina Kaif | మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్

Katrina Kaif | మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Katrina Kaif | మాల్దీవులు Maldives అంటే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి నీలి రంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. తెల్లటి ఇసుక తిన్నెలు.. ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతి అందాలు. ప్ర‌తి జంట కూడా ఈ అందాల‌ని ఆస్వాదించాల‌ని ఎంతో అనుకుంటారు. అయితే గ‌తంలో ప్రధాని మోదీ(Prime Minister Modi)పై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్‌, మజూమ్‌ మాజిద్‌.. అనుచిత వ్యాఖ్యలు చేయ‌డంతో భారతీయులు విరుచుకుపడ్డారు. ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’ (Boycott Maldives)కు ఎంతో మంది పిలుపునిచ్చారు. వేల మంది మాల్దీవ్స్​ ప్రయాణాలను క్యాన్సిల్​ చేసుకున్నారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డిన‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది.

Katrina Kaif | బ్రాండ్ అంబాసిడ‌ర్..

అయితే మాల్దీవులను ప్రముఖ పర్యాటక గమ్యంగా పరిచయం చేయడంలో భాగంగా బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్‌(Bollywood star Katrina Kaif)ను గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ప్రకటించింది మాల్దీవుల టూరిజం ప్రమోషన్ సంస్థ మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్(MMPRC). ఈ సందర్భంగా మాట్లాడిన కత్రినా కైఫ్, “మాల్దీవులు అనేవి సహజసిద్ధమైన అందం, విలాసవంతమైన విశ్రాంతికి చిహ్నం. ఇలాంటి సుందర గమ్యస్థలానికి ప్రతినిధిగా ఎంపిక చేయబడడం నాకు గౌరవంగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు అత్యుత్తమ అనుభవాలను అందించేందుకు ఇది ఒక వేదిక అని క‌త్రినా స్ప‌ష్టం చేశారు.

Visit Maldives సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రాహీం షియురీ మాట్లాడుతూ, “కత్రినా కైఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, ఆమె శక్తివంతమైన పర్సనాలిటీ మాల్దీవుల బ్రాండ్‌కు సరైన ప్రతినిధిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రచారం ద్వారా మాల్దీవుల “Sunny Side of Life” నినాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలని మాల్దీవుల ప్రభుత్వం ఆశిస్తోంది. ఇక మరోవైపు, మాల్దీవులతో రాజకీయంగా కూడా భారత్ సంబంధాలు మరింత బలపరచుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు(Maldives President Mohamed Mujibur Rahman) ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందిస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో మాల్దీవులకు వెళ్లే అవకాశముందంటూ వార్తలు వెలువడ్డాయి. జూలై 26న మాల్దీవుల స్వాతంత్య్ర‌ దినోత్సవం(Maldives Independence Day) జరుగనుంది. ఇదే తేదీన పర్యటన జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇది ముయిజ్జు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ చేయబోయే మొదటి పర్యటన అవుతుంది. కత్రినా కైఫ్ గ్లోబల్ అంబాసిడర్‌గా, మరోవైపు ప్రధాని మోదీ పర్యటన.. ఈ రెండు సంఘటనలూ మాల్దీవులను ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మరింత బలోపేతం చేయ‌డం ఖాయం.

Must Read
Related News