అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Katrina Kaif | బాలీవుడ్ ప్రముఖ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కత్రినా తాను గర్భవతి అని సామాజిక మాధ్యమాల ద్వారా గుడ్ న్యూస్ పంచుకోగా,ఈ సమాచారం అభిమానుల్లో ఆనందోత్సాహం నింపింది.
బిడ్డకు జన్మనివ్వబోతున్న శుభసమయంలో వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తతో పాటు మరో ఆసక్తికర అంశం కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా(Astrologer Anirudh Kumar Mishra), ఈ జంటకు పుట్టబోయే తొలి బిడ్డ అమ్మాయి అవుతుందని జోస్యం చెప్పారు. “The first child of Vicky Kaushal and Katrina Kaif will be a daughter” అంటూ ఆయన X (Twitter) లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Katrina Kaif | సినిమాలకు బ్రేక్ – కుటుంబానికే ప్రాధాన్యత
నెటిజన్లు దీనిపై క్రేజీ కామెంట్లు చేస్తూ “ఇప్పుడు కూతుళ్ల సీజన్ నడుస్తోందే” అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్(Vicky Kaushal)లది ప్రేమ వివాహం. కత్రినాకంటే వయసులో చిన్నవాడైన విక్కీతో ఆమె 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా రిసార్ట్‌లో హిందూ సంప్రదాయాల నడుమ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట బాలీవుడ్‌లో పాపులర్ కపుల్స్‌లో ఒకరిగా నిలిచింది. ఇప్పుడు పెళ్లైన నాలుగు ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.
ప్రగ్నెన్సీ తర్వాత కత్రినా(Katrina Kaif) ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. చివరిసారిగా ఆమె విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ (2024) చిత్రంలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా కత్రినా సుపరిచితురాలే. వెంకటేశ్‌తో ‘మల్లీశ్వరి’, బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ వంటి చిత్రాల్లో నటించి తన కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ అందాల తార, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇదే సమయంలో విక్కీ కౌశల్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ఛావా’ సినిమాతో మంచి విజయం అందుకున్న విక్కీ, ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ లో నటిస్తున్నాడు. బాలీవుడ్‌కి మరో సెలబ్రిటీ బేబీ రానున్న నేపథ్యంలో, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూనే, జ్యోతిష్యుడి జోస్యం నిజమవుతుందా? అన్న ఆసక్తికర చర్చ కూడా నెట్టింట నడుస్తోంది.