అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kashi Express | ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైలుకు బాంబు బెదిరింపు (bomb threat) రావడం కలకలం సృష్టించింది. గోరఖ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న కాశీ ఎక్స్‌ప్రెస్ బాంబు (Kashi Express) ఉందంటూ ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.
రైలు మయూ రైల్వే స్టేషన్‌కు (Mayu railway station) చేరుకున్న వెంటనే అధికారులు అన్ని బోగీల నుంచి ప్రయాణికులను సురక్షితంగా దింపేశారు. అనంతరం ప్రతి బోగీని డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ బెదిరింపు కాల్‌గా అధికారులు నిర్ధారించారు.
తనిఖీలు పూర్తి చేసిన అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.