అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karur Incident | తమిళనాడు (Tamil Nadu) లోని కరూర్‌లో శనివారం (సెప్టెంబరు 27, 2025) జరిగిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) Tamil Vetri Kazhagam (TVK) నాయకుడు విజయ్ సమావేశంలో జరిగిన తొక్కిసలాట తమిళనాడులో చరిత్రలో ఓ మాయని మచ్చ.
కాగా, దీనిపై కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) లో పార్టీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి పట్టణంలోకి విజయ్ రావడాన్ని ఆలస్యం చేశారని పొందుపర్చారు.
తాగునీరు, ఆహారం, వైద్య సాఆయం లేకుండా చాలా గంటలు వేచి ఉన్న ప్రజలు వేడి, రద్దీ కారణంగా అలసిపోయారని, ఫలితంగా తొక్కిసలాట జరిగి Karur Incident అనేక మంది మరణించారని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు పోలీసులు.
Karur Incident | సుమోటోగా..
కరూర్ టౌన్ పోలీస్ స్టేషన్ Karur Town Police Station ఇన్‌స్పెక్టర్ జి. మణివన్నన్ శనివారం రాత్రి సుమోటోగా ఫిర్యాదు చేయడంతో భారతీయ న్యాయ సంహితలోని నాలుగు సెక్షన్లు, తమిళనాడు ప్రజా ఆస్తి (నష్టం, నష్ట నివారణ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘బస్సీ’ ఆనంద్, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సి.టి.ఆర్. పై కేసు నమోదైంది. నిర్మల్ కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి మతియజగన్ నిందితులుగా ఉన్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. వేలుసామిపురం (Velusamipuram) లో విజయ్ ప్రచారం కోసం కరూర్ పట్టణం, దాని పరిసరాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 500 మంది పోలీసు సిబ్బంది, హోమ్ గార్డులను నియమించారు.
విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు కరూర్‌కు వస్తారనే నివేదికల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
విజయ్ సమావేశానికి పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక వేసుకుని, తమ రాజకీయ బలాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో విజయ్ రాకను నాలుగు గంటలు ఆలస్యం చేశారని FIRలో పొందుపర్చారు. చాలా గంటలు వేచి ఉన్న ప్రజలు అలసిపోయారు.
Karur Incident | ఉదయం నుంచే..
వేలుసామిపురం ప్రధాన రహదారి, కోవై రోడ్డు, మునియప్పన్ కోయిల్ జంక్షన్, తిరుకంపులియూర్ రౌండ్‌తానా, మధురై-సేలం బైపాస్ రోడ్డు వద్ద ఉదయం 10 గంటల నుంచే ప్రజలు, పార్టీ మద్దతుదారులు రావడం మొదలెట్టారని ఎఫ్ఐఆర్ చెబుతోంది. 10,000 మంది కేడర్ వస్తారని మతియఝగన్ పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, 25,000 మందికి పైగా ప్రజలు వచ్చారు.
విజయ్ వేలాయుతంపాళయం, తవిటుపాళయం సరిహద్దు ద్వారా కరూర్ జిల్లాలోకి సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ప్రవేశించినట్లు FIR పేర్కొంది. అనుమతి లేకుండా రోడ్‌షోలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని, తద్వారా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మునియప్పన్ కోయిల్ జంక్షన్‌కు చేరుకోవడానికి అనేక చోట్ల నిబంధనలను ఉల్లంఘించారని ఎఫ్‌ఐఆర్‌లో నిక్షిప్తం చేశారు.
విజయ్ వాహనాన్ని క్యారేజ్‌వే యొక్క తప్పు వైపున (కుడి వైపున) వేలుసామిపురం జంక్షన్‌కు చేరుకుని, సాయంత్రం 7 గంటలకు పెద్ద జనసమూహం మధ్యలో ఆపారని ఎఫ్‌ఐఆర్‌లో రాసుకొచ్చారు.
ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కలిసి.. నిర్మల్ కుమార్, మతియజగన్‌ను చాలాసార్లు హెచ్చరించారని పోలీసులు చెబుతున్నారు.
బందోబస్తు కోసం మోహరించిన పోలీసు సిబ్బంది.. పరిస్థితిని ముందే అంచనా వేసి హెచ్చరించారంటున్నారు. కానీ, పోలీసు అధికారుల మాటలను నిర్వాహకులు పట్టించుకోలేదని ఎఫ్ఐఆర్ చెబుతోంది.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ప్రజలు దుకాణాలు, సమీపంలోని చెట్లపై నిర్మించిన వాలుగా ఉన్న టిన్ పైకప్పులపైకి ఎక్కారు. వారి బరువు ఆపలేక టిన్ షెడ్లు, చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. దీంతో కింద నిలబడిన వారిపై పైనున్నవారు పడిపోయారు. ఈ క్రమంలోనే ఊపిరాడక మరణాలు సంభవించాయి.