HomeజాతీయంVijay Thalapathy | కరూర్ ఘటన కలచివేసింది.. త్వరలోనే బాధితులను కలుస్తానన్న విజయ్

Vijay Thalapathy | కరూర్ ఘటన కలచివేసింది.. త్వరలోనే బాధితులను కలుస్తానన్న విజయ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Thalapathy | కరూర్ తొక్కిసలాట ఘటన తననెంతో ఆవేదనకు గురి చేసిందని తమిళ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ అన్నారు. తన జీవితంలో ఇంతటి బాధాకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొనలేదని చెప్పారు. ఈ ఘటనపై త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) కు తనపై కోపముంటే అది తనపైనే తీర్చుకోవాలని, తమ పార్టీ కార్యకర్తలకు హానీ కలిగించవద్దని కోరారు. ఇకపై మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. తమిళనాడులోని కరూర్లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన రెండు రోజుల తర్వాత విజయ్ మంగళవారం Xలో ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.

Vijay Thalapathy | నాపై కోపముంటే అరెస్టు చేయండి..

కానీ ప్రజల నుంచి తనపై అమితమైన ప్రేమ కురుస్తోందని, నాపై ప్రేమతో ర్యాలీకి భారీగా తరలివచ్చారని చెప్పారు. అయితే తొక్కిసలాట(Karur Stampede) విషయంలో తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ జరుగని రీతిలో కరూర్ లోనే ఈ ఘటన ఎందుకు జరిగిందని విజయ్(Vijay Thalapathy) ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ కావాలనే తమపై కక్ష గట్టారా? తమపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. “నా జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు.

నేను తీవ్ర బాధలో ఉన్నాను… అన్ని రాజకీయాలను పక్కనపెట్టి, సురక్షితమైన స్థలం కోసం మేము ఎల్లప్పుడూ పోలీసుల అనుమతిని అభ్యర్థిస్తాము. కానీ జరగకూడనివి జరిగాయి. నేను త్వరలో బాధితులను కలుస్తాను.. తమవారిని కోల్పోయి దుఃఖిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..నా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సార్, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను—దయచేసి నా పార్టీ కార్యకర్తలకు హాని కలిగించవద్దు. మీరు నా ఇంటికి లేదా నా కార్యాలయానికి వచ్చి నాపై ఏదైనా చర్య తీసుకోవచ్చు, కానీ వారిపై కాదు… త్వరలో, ప్రతి నిజం బయటపడుతుంది” అని వీడియోలో పేర్కొన్నారు.

Vijay Thalapathy | త్వరలోనే కరూర్ కు..

తొక్కిసలాట బాధితులను త్వరలోనే పరామర్శిస్తానని విజయ్ ప్రకటించారు. “నేను కరూర్ను సందర్శించలేదు ఎందుకంటే ఇది అసాధారణ పరిస్థితికి దారితీస్తుంది. నేను త్వరలో మిమ్మల్ని (బాధితుల కుటుంబాలు, గాయపడిన వారిని) కలుస్తాను” అని ఆయన వెల్లడించారు.