Homeజిల్లాలుకామారెడ్డిKarthika Masam | భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి తులసి పూజలు.. శివకేశవుల నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

Karthika Masam | భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి తులసి పూజలు.. శివకేశవుల నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో తులసి పూజలు నిర్వహించారు. అలాగే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి/బాన్సువాడ/ఆర్మూర్​: Karthika Masam | కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు నదీ స్నానాలు చేస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ, హరినామస్మరణతో మార్మోగాయి. హరిహరులకు భక్తితో అభిషేకాలు నిర్వహించారు.

Karthika Masam | ఇళ్లలో భక్తితో తులసీపూజలు

ఇళ్లలో మహిళలు భక్తిశ్రద్ధలతో తులసి పూజలు (Tulsi Pujas) చేశారు. తులసి కోటను పూలతో అలంకరించి.. దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. శివపార్వతులు.. శ్రీకృష్ణ రుక్మిణి దేవుళ్లకు ప్రత్యేక పూజలతో మొక్కలు తీర్చుకున్నారు. 365, 1,016 ఒత్తులు కలిగిన దీపాలను వెలిగించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.

నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, ముఖ్యంగా 365 ఒత్తులు కలిగిన దీపాలను వెలిగించడం వల్ల ఏడాదిలో కోల్పోయిన పుణ్యాన్ని తిరిగి పొందవచ్చని భక్తులు (Devotees) విశ్వసిస్తారు. ఈ పూజలు చేయడం వల్ల సంపద, సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నదులు చెరువుల్లో దీపాలను వదిలి కార్తీకమాస పూజలను (Karthikamasha pujas) భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

Karthika Masam | దుర్కిలోని సోమలింగేశ్వర ఆలయంలో..

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నస్రుల్లాబాద్​ మండలం దుర్కిలోని సోమలింగేశ్వర ఆలయంలో మహిళలు పెద్దసంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. కుటుంబ సమేతంగా ఆలయ ప్రాంగణం సందర్శించిన మహిళలు మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం వెలుగుజిలుగులు నిండిపోగా.. హరహర మహాదేవ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి.

Karthika Masam | ఆర్మూర్​లోని నాగలింగేశ్వర ఆలయంలో..

అర్ముర్ పట్టణంలోని (Armoor Town) ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో నాగలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సత్య శ్రీనివాస్, కలిగోట గంగాధర్, రాజయ్య, రమణ, నారాయణ, అజయ్ పాల్గొన్నారు.