అక్షరటుడే, ఇందూరు: Karthika Masam | పవిత్ర కార్తీకమాసం సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు సందడిగా కనిపించాయి. పౌర్ణమి సందర్భంగా బుధవారం తులసి పూజలు, సత్యనారాయణ వ్రతాలు (Satyanarayana vratas) నిర్వహిస్తారు. ఈ మేరకు పువ్వులు, చెరుకు ఆకులు, ఉసిరి కొమ్మల క్రయవిక్రయాలతో నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, ఖలీల్వాడి, గాంధీచౌక్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు కిటకిటలాడాయి.
Karthika Masam | బంతిపూలకు పెరిగిన గిరాకీ..
కార్తీకమాసం సందర్భంగా నిర్వహించే తులసి పూజలకు (Tulsi pujas) వినియోగించే బంతిపూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బంతిపూలను రాశులుగా పోసి అమ్ముతున్నారు. డిమాండ్ ఉండడంతో పూల ధరలు ఆకాశాన్నంటాయి.

Karthika Masam | దీపాల వెలుగుల్లో ఆలయాలు..
కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ పవిత్రమాసంలో ఆలయాల్లో పిండిదీపాలు వెలిగిస్తే కోరికలు తీరుతాయని భక్తలు (Devotees) నమ్మకం. ఇంటిల్లిపాది చల్లంగా ఉండాలని.. పాడిపంటలు బాగుండాలని మహిళలు ఆలయాల్లో పిండి, ఉసిరిలో దీపాలు వెలగిస్తారు. భక్తితో శివుడిని కొలుస్తారు.
