అక్షరటుడే, వెబ్‌డెస్క్: Divorce celebration | సాధారణంగా వివాహ వేడుకలు గొప్పగా జరుపుకోవడం మనం చూశాం. కానీ ఎప్పుడైనా విడాకుల వేడుక (divorce ceremony) చూశారా? అందులోను పాలాభిషేకం, కేక్ కటింగ్, గిఫ్ట్ డిటైల్స్ (Gift Details)తో జనం ఆశ్చర్యపోయే రేంజ్‌లో సెలబ్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది?
అలాంటి ఓ అసాధారణమైన సంఘటన ఇప్పుడు కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన విడాకులను వేడుకగా జరుపుకోవడం నెట్టింట్లో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @iamdkbiradar అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో, విడాకులు తీసుకున్న వ్యక్తిని అతని తల్లి పాలతో స్నానం చేయిస్తోంది.
Divorce celebration | వెరైటీ సెలబ్రేషన్స్…
ఇది సాధారణంగా దేవాలయాల్లో చేసే శుద్ధి కర్మలా ఉంది. కానీ ఇక్కడ, కొడుకు కొత్త జీవితం ప్రారంభించనున్న సందర్భంగా ఓ తల్లి ఇలా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. పాలాభిషేకం తర్వత ఆ వ్యక్తి సూటు బూటు ధరించి కొత్త పెళ్లి కొడుకు మాదిరిగా తయారయ్యాడు. అనంతరం ఆయన స్నేహితులతో కలిసి కేక్ కట్ చేశారు. కేక్‌పై “Happy Divorce – 120g Gold, ₹18 లక్షల క్యాష్” అనే సందేశం ఉంది. ఆ వ్యక్తి వీడియో ప్రకారం, ఈ విడాకులు పరస్పర అంగీకారంతో జరిగినట్టు తెలుస్తుంది. భార్యకు 120 గ్రాముల బంగారం, ₹18 లక్షల నగదు ఇచ్చాడని ముచ్చటించుకుంటున్నారు.
ఇక వీడియోతో పాటు అతను I’m single. I’m happy. I’m free అని రాసుకొచ్చాడు. ఈ క్యాప్షన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. వీడియోకు లక్షల వ్యూస్, వేల కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోపై నెట్టింట వినూత్న స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని ఆత్మవిశ్వాసం, ఫ్రీడమ్ సెలబ్రేషన్ అంటూ సమర్థిస్తుండగా మరికొందరు విడాకుల్ని ఇలా వేడుకగా మార్చడం తప్పు అని విమర్శిస్తున్నారు. ఈ ఘటన ప్రజలకు విడాకులపైనా కొత్త కోణంలో ఆలోచించేలా చేసింది. ఒకప్పుడు విడాకులు ఆందోళనకు, తలదించుకునే విషయానికి నిదర్శనమైతే, ఇప్పుడు కొందరు వాటిని నూతన ఆత్మవిశ్వాసానికి నాందిగా తీసుకుంటున్నారు.