HomeUncategorizedKarnataka Deputy CM | సైకిల్ పైనుండి కింద ప‌డ్డ ఉప ముఖ్య‌మంత్రి.. మీడియాలో చూపించొద్దంటూ..

Karnataka Deputy CM | సైకిల్ పైనుండి కింద ప‌డ్డ ఉప ముఖ్య‌మంత్రి.. మీడియాలో చూపించొద్దంటూ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Deputy CM | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Bangalore chinnaswamy stadium) దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనతో క‌ర్ణాట‌క‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy CM DK Shivakumar)పై పెద్దఎత్తున విమ‌ర్శ‌లు వస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ ఘ‌ట‌న‌కు కర్నాటక ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆర్​సీబీ విజయోత్సవాలను నిర్వహించిందని మండిపడింది. ఇది తీవ్ర నిర్లక్ష్యం అని ఆరోపించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Karnataka Deputy CM | అలా ఎలా ప‌డ్డాడు..

తొక్కిసలాట ఘటనతో సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ కుమార్ (DK Shivakumar) తీవ్ర ఇబ్బందుల్లో ప‌డ్డారు. దీనికి తోడు డీకే శివ కుమార్ ప్రస్తుతం మ‌రోసారి ట్రోలింగ్ బారిన‌ప‌డ్డారు. క‌ర్ణాటక రాష్ట్ర ఉప‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ (Congress Party) ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్​కు తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్​లోనే అత్యంత ధనికమైన లీడర్​గా పేరుగాంచిన డీకే శివకుమార్ కిందపడిపోయారు. సైకిల్ పైనుంచి దిగుతూ.. డీకే శివకుమార్ కిందపడిపోవడం చ‌ర్చ‌నీయాంశమైంది. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణం దినోత్స‌వం 2025 సంద‌ర్భంగా జ‌రిగిన ఈకో వాక్ కార్య‌క్ర‌మం(Eco Walk Program)లో భాగంగా డీకే శివ కుమార్ సైకిల్ తొక్కారు.

విధాన సౌద వ‌ద్ద‌కు రాగానే, కిందకు దిగేందుకు ప్ర‌య‌త్నించాడు శివ కుమార్. అదుపుత‌ప్పి ఆయ‌న కింద ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే కింద ప‌డ్డ స‌మ‌య‌లో శివ కుమార్ ఇది కెమెరా మెన్స్ చూపించొద్దు అంటూ స‌ర‌దాగా అన్నారు. ఆయ‌న‌కు ఈ ప్ర‌మాదంలో ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగానే ఉన్నారు. ఇక ఈ ఘ‌ట‌న త‌ర్వాత మీడియాతో మాట్లాడిన శివ కుమార్ అహ్మ‌దాబాద్‌లో (Ahmedabad) 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఇక్క‌డ 22 డిగ్రీలు మాత్ర‌మే ఉంది. త‌మ ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటోందని చెప్పారు.