HomeUncategorizedChinnaswamy Stadium | తొక్కిస‌లాట ఘ‌ట‌న‌తో సంచ‌లన నిర్ణ‌యం.. ఇక బెంగ‌ళూరులో మ్యాచ్‌లు లేన‌ట్టే..!

Chinnaswamy Stadium | తొక్కిస‌లాట ఘ‌ట‌న‌తో సంచ‌లన నిర్ణ‌యం.. ఇక బెంగ‌ళూరులో మ్యాచ్‌లు లేన‌ట్టే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Chinnaswamy Stadium | ఆర్సీబీ RCB విక్ట‌రీ ప‌రేడ్ ఘ‌ట‌న ఎంత వివాదాస్ప‌దం అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ వివాదం త‌ర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఆర్సీబీ ఫ్రాంఛైజీని కూడా నిందితుల లిస్ట్‌లో చేసిన పోలీసులు.. ఆ జట్టు మార్కెటింగ్ హెడ్‌ను కటకటాల వెనక్కి తోశారు. ఇక ఇప్పుడు మ‌రో అడుగు వేశారు. ఇంత జరగడానికి కారణమైన చిన్నస్వామి స్టేడియంలో ఇకపై మ్యాచ్‌లు జరగకుండా.. స్టేడియాన్ని మరోచోటుకి మార్చాలని ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Chinnaswamy Stadium | వేదిక మార్పు..

చిన్నస్వామి స్టేడియం బటయ జరిగిన ఈ సంఘటనలో 11 మంది మృతి చెందడంతో పాటు మరో 50 మంది గాయపడ్డారు.ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య.. నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియాన్ని శివార్లలోకి తరలించాలనుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియాన్ని Chinnaswamy stadium మరొక ప్రదేశానికి తరలించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. ఇలాంటి దురదృష్టకర ఘటన ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగకూడదు. ఈ సంఘటన వ్యక్తిగతంగా నన్ను కలిచి వేసింది. మా ప్రభుత్వానికి తీవ్ర బాధ కలిగించింది.

ఈ ఘటన విషయంలో మా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకలేదు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై సస్పెన్షన్ విధించాం. తొక్కిసలాట జరిగిన రెండు గంటల తర్వాతే నాకు సమాచారం అందింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఈ ఘటనకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధారామయ్య Siddaramaiah వెల్లడించారు. ప్రభుత్వం బెంగళూరు స్టేడియాన్ని మరో చోటుకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4న జరిగిన దురదృష్ట ఘటనలో ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు చేయాలేదని సీఎం స్పష్టతనిచ్చారు.

Must Read
Related News