అక్షరటుడే, వెబ్‌డెస్క్: karnataka cm change buzz | కర్ణాటకలో సీఎం మార్పు అంశం గత కొన్ని నెలలుగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుంచే సిద్ధరామయ్య–డీకే శివకుమార్ మధ్య సీఎం పదవిపై పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో హైకమాండ్ సీనియార్టీ, ప్రజల్లో ఉన్న గుర్తింపును పరిగణలోకి తీసుకొని సిద్ధరామయ్యను siddramaiah ముఖ్యమంత్రిగా నియమించింది.
అదే సమయంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి డీకే శివకుమార్‌కు ఇవ్వబడుతుందనే ప్రచారం కూడా గట్టిగా వినిపించింది. తాజాగా సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావడంతో ఆ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంలో డీకే శివకుమార్ ఎక్స్‌లో చేసిన పోస్టుతో ఈ వివాదానికి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
karnataka cm change buzz | ఏం జరిగింది?
ఐదేళ్లపాటు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని, తామంతా ఆయనతో కలిసి పనిచేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. 140 మంది ఎమ్మెల్యేలు తనవాళ్లేనని, తాను గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించనని వెల్లడించారు. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, మంత్రి పదవులు కోరుకోవడం నాయకుల హక్కే అయినప్పటికీ, హైకమాండ్ నిర్ణయమే తుది అని వివరించారు.
ఇటీవలి రోజుల్లో డీకే శివకుమార్ DK Shiva kumar మద్దతుదారులు పలు కార్యక్రమాల్లో ఆయననే సీఎం చేయాలని బహిరంగ డిమాండ్ చేయడం, తాను సీఎం కావాలనుకోవడం తప్పేమీ కాదని డీకే స్వయంగా ఒకసారి వ్యాఖ్యానించడం… ఇవన్నీ సీఎం మార్పు అంశాన్ని మరింత వేడెక్కించాయి.
మరోవైపు సిద్ధరామయ్య మాత్రం నిరంతరం సీఎం మార్పు జరగదని, ఐదేళ్లపాటు తానే కొనసాగుతానని స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశమై కేబినెట్ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరగా, హైకమాండ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే సిద్ధరామయ్య–డీకే శివకుమార్ విభేదాల నేపథ్యాన్ని పరిశీలిస్తే, సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం 1980లో జనతాదళ్ (సెక్యులర్)లో ప్రారంభమై, అక్కడ కీలక నాయకుడిగా ఎదిగినా దేవెగౌడ కుటుంబంతో విభేదాల అనంతరం 2006లో కాంగ్రెస్‌లో చేరడం జరిగింది.
2013లో మొదటిసారి సీఎం అయ్యారు. ఇక డీకే శివకుమార్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉండి, 1990లో అధికారికంగా పార్టీలో చేరి రాష్ట్రంలో బలమైన ఆధారాన్ని ఏర్పరచుకున్నారు. 2023 ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన విస్తృత పర్యటనలు, పార్టీని ఒంటిబలంగా నిలబెట్టిన తీరు కారణంగా ఆయనకూ సీఎం అవుతారనే అంచనాలు పెరిగాయి.
కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆయన మద్దతుదారుల్లో ఆ ఆశలు మరోస్థాయికి చేరాయి. కానీ చివరికి హైకమాండ్ High Command సిద్ధరామయ్యకే సీఎం పదవి అప్పగించడంతో అసంతృప్తి పెరిగింది.
అయితే డీకే శివకుమార్ స్వయంగా ఐదేళ్లపాటు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని పబ్లిక్‌గా ప్రకటించడం, హైకమాండ్ కూడా అదే వైఖరిని స్పష్టం చేయడం వల్ల ఈ వివాదానికి పూర్తిగా తెరపడినట్లైంది.
మొత్తానికి, కర్ణాటకలో సీఎం మార్పు అన్నది ఇక అధికారికంగా ముగిసిన చర్చ. సిద్ధరామయ్యే పూర్తి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డీకే శివకుమార్ స్పష్టమైన సంకేతం ఇచ్చేయడంతో రాజకీయ గందరగోళం అంతా చల్లారిపోయింది.
