HomeUncategorizedkarnataka | న‌డి రోడ్డుపై బ‌స్సు ఆపి న‌మాజ్ చేసిన డ్రైవ‌ర్.. ఆ త‌ర్వాత ఏం...

karnataka | న‌డి రోడ్డుపై బ‌స్సు ఆపి న‌మాజ్ చేసిన డ్రైవ‌ర్.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: karnataka | సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎవ‌రు ఏ త‌ప్పు చేసిన కూడా వెంట‌నే వీడియో తీసి అందులో పెట్టేస్తున్నారు. దాంతో వీడియో వైర‌ల్ కావ‌డం వెంట‌నే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు నమాజ్ కోసం నడిరోడ్డుపై బస్సును ఆపి, ప్ర‌యాణికుల సీటులో కూర్చొని ప్రార్ధ‌న చేయ‌డం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. డ్యూటీలో ఉన్న ఓ డ్రైవర్‌ (Bus Driver) నమాజ్‌ చేసుకునేందుకు బస్సు ఆపి అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకుంది.

డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిస్సహాయంగా వేచి ఉండాల్సి రావ‌డంతో, కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సదరు డ్రైవర్ Driver పై విచారణకు ఆదేశించారు. ఈ విష‌యం కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వ‌ద్ద‌కు చేర‌గా, ఆయ‌న దీనిపై తీవ్రంగా స్పందించారు. పనివేళల్లో ప్రార్థనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, సదరు డ్రైవర్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటన కర్ణాటకలో ఏప్రిల్ 29న హుబ్బళ్లిలో జరిగింది. హుబ్బళ్లి నుంచి హవేరికి వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగి సేవా నియమాలను ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రామలింగారెడ్డి ఆదేశించారు. విచారణ ముగిసే వరకు డ్రైవర్‌ను సస్పెన్షన్‌లో ఉంచినట్లు ఆ శాఖ పేర్కొంది. “ప్రజా సేవలో పనిచేసే సిబ్బంది కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఏ మతాన్ని అయినా ఆచరించే హక్కు ఉన్నప్పటికీ పని సమయాల్లో అలా చేయడం త‌ప్పు. బస్సును మధ్యలో ఆపి మరి నమాజ్ చేయడం అభ్యంతరకరం” అని మంత్రి రామ‌లింగా రెడ్డి Ramalinga Reddy ఒక ప్రకటనలో తెలిపారు.