అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karishma Kapoor | లండన్‌లో (London) పోలో ఆడుతున్న సమయంలో అస్వస్థతతో నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తరువాత, సంజయ్ రూ. 30వేల కోట్ల భారీ ఆస్తులపై కుటుంబంలో వివాదం మరింత తీవ్రమైంది.
సంజయ్ మాజీ భార్య కరిష్మా కపూర్ (Karishma Kapoor) తన పిల్లల తరఫున కోర్టులో పోరాటం సాగిస్తుండగా, సంజయ్ మూడో భార్య ప్రియా కపూర్ ఆస్తి పత్రాలను మార్ఫింగ్ చేసి మొత్తం ఎస్టేట్‌ను తన పరం చేసుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తోంది. తాజాగా హైకోర్టు విచారణలో కరిష్మా న్యాయవాది మహేష్ జెఠ్మలానీ కొత్త అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలో చదువుతున్న కరిష్మా–సంజయ్ కూతురు సమైరా రెండు నెలలుగా విశ్వవిద్యాలయ ఫీజు చెల్లించలేకపోతున్నారని కోర్టుకు తెలిపారు.
Karishma Kapoor | కుటుంబ వార్..
పిల్లల ఆస్తి మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న ప్రియా కపూర్ దీనిపై బాధ్యత వహించాలన్నారు. అయితే జస్టిస్ జ్యోతి సింగ్, ఇలాంటి వ్యక్తిగత అంశాలతో కోర్టు ప్రక్రియలను డ్రామాటిక్ చేయద్దని న్యాయవాదులను హెచ్చరించారు. ప్రియా కపూర్ (Priya Kapoor) తరఫున న్యాయవాది రాజీవ్ నాయర్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. మైనర్ల ఖర్చులు భారీగా పెరిగాయని, వాటిని కూడా ప్రియానే చెల్లిస్తోందని పేర్కొన్నారు. పిల్లల ఫీజు పెండింగ్‌లో ఉందని, పిల్లల ఆస్తి ప్రియా కపూర్‌తోనే ఉందని, ఆమెను జవాబుదారీగా చూడాలని కూడా వాదించినట్లు తెలుస్తోంది.
అయితే న్యాయస్థానం, ఇలాంటి బలహీన ఆరోపణలతో సమయం వృథా చేయవద్దని స్పష్టం చేసింది. సంజయ్ కపూర్ (Sanjay kapoor) 21 మార్చి 2025 తేదీతో రాసిన వీలునామాలో వ్యక్తిగత ఆస్తులన్నింటినీ ప్రియా సచ్‌దేవ్ కపూర్‌కు బదలాయించినట్లు పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని కరిష్మా వైపు వాదిస్తున్నారు. ఈ పత్రం నకిలీదని, ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కానీ ప్రియా కపూర్ న్యాయవాదులు ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అని, కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో కూడా పంచుకున్నారని చెప్పారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు నవంబర్ 19న విచారణను పునఃప్రారంభించనుంది. ఇంజక్షన్ పిటిషన్‌పై వాదనలు త్వరగా ముగించాలని సూచించింది. ప్రస్తుతానికి సంజయ్ కపూర్ ఆస్తులపై పెద్ద లీగల్ వార్ సాగుతోంది.
