అక్షరటుడే, వెబ్డెస్క్: Karimnagar Ring Road Promise | కరీంనగర్ వాసులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గుడ్న్యూస్ చెప్పారు. నగరం చుట్టూ రింగ్ రోడ్డు వేస్తామన్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. అనంతరం నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్ రింగ్ రోడ్డు కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు (New ration cards) ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అర్హులందరికీ కార్డులు అందిస్తోందన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల గురించి ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
Karimnagar Ring Road Promise | డంపింగ్ యార్డు తొలగిస్తాం
కరీంనగర్ డంపింగ్ యార్డు (Karimnagar dumping yard) సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పొన్నం హామీ ఇచ్చారు. నగరంలో తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నారు. అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం హయాంలో వేములవాడకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ రూ.100 కోట్లు కేటాయించిందని చెప్పారు. కరీంనగర్ తీగల వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ, రైలు, పాస్ పోర్టు కేంద్రం, మాత శిశు హాస్పిటల్, కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూల్ కాంగ్రెస్ హయాంలో తెచ్చామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నగరానికి ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పాలనలో కరీంనగర్ మున్సిపాలిటీ (Karimnagar Municipality) అభివృద్ధికి నోచుకోలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అవినీతిమయంగా మారిన కరీంనగర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.