అక్షరటుడే, వెబ్‌డెస్క్: raping patient in hospital | కరీంనగర్ Karimnagar నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన యువతిపై అక్కడి మేల్ నర్సు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
బాధిత యువతి వివరాల ప్రకారం.. శనివారం రాత్రి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె, తల్లితో కలిసి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటుండగా, ఆమె తల్లి వెయిటింగ్ హాల్‌లో నిద్రించింది.
raping patient in hospital | దారుణం..
తెల్లవారుజామున, ఆసుపత్రిలో మేల్ నర్సుగా MAle Nurse పనిచేస్తున్న వ్యక్తి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఆరోపించింది.
మత్తు తగ్గిన తరువాత ఆమె అస్వస్థతకు గురై తల్లికి విషయం చెప్పింది. తల్లి ఆసుపత్రి సిబ్బందిని నిలదీసి, అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై సీఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ.. “అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య పరీక్షల అనంతరం తేలుతుంది. బాధిత యువతిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాం. అలాగే, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. పూర్తి దర్యాప్తు జరుగుతోంది..” అని వివరించారు.
వైద్యం కోసం వెళ్లిన చోట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల Hospitals వంటివి అత్యంత నమ్మకమైన ప్రదేశాలు కావాలని, ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయనే ఆశాభావంతో ప్రజలు, మానవ హక్కుల సంస్థలు, మహిళా సంఘాలు ఎదురు చూస్తున్నాయి.