అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karimnagar Mayor | కరీంనగర్ మేయర్ పదవిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీగా మేయర్ పీఠం దక్కించుకోవాలని తాము ఆలోచిస్తున్నామన్నారు. ఈ మేరకు స్థానిక నాయకులు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా వేములవాడ (Vemulawada) ఆలయాన్ని మంత్రి పొన్నం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. మేయర్ పీఠంపై ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్లో 66 డివిజన్లు ఉన్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మానకొండూరు ఎమ్మెల్యేలతో కలిపి ఓట్ల సంఖ్య 69కి చేరుతుందన్నారు. బీజేపీ 30 సీట్లలో మాత్రమే గెలిచిందన్నారు. మెజారిటీ రాకున్నా తాము మేయర్ అవుతామని బండి సంజయ్ ప్రకటించారని విమర్శించారు. ఆయన ఎలా ప్రకటించారో.. మిగతా పార్టీలకు కూడా అలాగే వ్యూహాలు ఉంటాయని చెప్పారు. గతంలో 13 సీట్లు గెలిచిన సమయంలో కూడా కరీంనగర్లో కాంగ్రెస్ మేయర్ పదవి దక్కించుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి మేయర్ పీఠం దక్కించుకుంటామన్నారు. దీనికి సీఎం, మంత్రులకు సంబంధం లేదన్నారు.
Karimnagar Mayor | సంజయ్ ఏమన్నారంటే..
కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది, ఫార్వార్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు గెలిచారు. ఈ క్రమంలో శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థులు బీజేపీలో చేరారని ప్రకటించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటామన్నారు. బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తమను అడ్డుకుంటే ఆయా పార్టీల నాయకులను రోడ్ల మీద తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు తాజాగా పొన్నం కౌంటర్ ఇచ్చారు.
Karimnagar Mayor | వారికి మద్దతు ఉంటుంది
ప్రజాస్వామ్య బద్ధంగా కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీ గెలిచామని చెప్పుకున్నా.. తాము ఏమైనా అన్నామా అని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుందని, ఇక్కడ కూడా మెజారిటీ రాలేదన్నారు. అయినా జెండా ఎగురవేశామని బండి సంజయ్ చెప్పినా.. తాము ఏమి అనలేదని ఆయన మాత్రం రోడ్లపై తిరగనివ్వం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని మేయర్ పీఠం కోసం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. వారికి తమ మద్దతు ఉంటుందన్నారు.
1 comment
[…] Devarakonda met Revanth Reddy | విజయ్–రష్మిక పెళ్లి… Karimnagar Mayor | కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్ర… Bill Gates to Visit Amaravati | ఏపీలో బిల్… Jagtial Congress Internal Rift […]
Comments are closed.