అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karimnagar Mayor Tension | కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. 30 సీట్లు గెలిచిన బీజేపీ (BJP)కి మేయర్ పదవి దక్కకుండా కాంగ్రెస్ యత్నిస్తున్నట్లు సమాచారం.
కరీంనగర్లో 66 వార్డులు ఉండగా.. బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది, ఫార్వార్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు గెలిచారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీలో చేరారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన బలం ఆ పార్టీకి వచ్చింది. అయితే బీజేపీ క్యాంప్ నుంచి పలువురిని కాంగ్రెస్ (Congress) లాగినట్లు తెలుస్తోంది. ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)మాట్లాడుతూ.. తాము మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
Karimnagar Mayor Tension | కాంగ్రెస్ స్కెచ్
మేయర్ పీఠం బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు సమాచారం. మేయర్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ పేరు ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు బీఆర్ఎస్ (BRS) ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో మేజిక్ ఫిగర్ 30కి తగ్గనుంది. ప్రస్తుతం బీజేపీకి 30 మంది సభ్యులు ఉన్నారు. ఎంపీ సంజయ్ (MP Sanjay) ఎక్స్ అఫీషియో ఓటుతో కలుపుకుంటే ఆ పార్టీ సులువగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. అయితే కాంగ్రెస్ ఏం చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తమ పార్టీ కౌన్సిలర్లతో క్యాంపు నుంచి కరీంనగర్ చేరుకున్నారు. నగరంలోని ఓ హోటల్లో వారితో సమావేశం అయ్యారు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఆయన చక్రం తిప్పుతున్నారు.
1 comment
[…] వెబ్‌డెస్క్ : Karimnagar BJP Mayor Victory | కరీంనగర్ (Karimnagar) మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం […]
Comments are closed.