HomeసినిమాKantara Chapter 1 | ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్ల వర్షం.. వారం రోజుల్లోనే రూ....

Kantara Chapter 1 | ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్ల వర్షం.. వారం రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

Kantara Chapter 1 | రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన పీరియడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kantara Chapter 1 | కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది.

అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.509.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఫస్ట్ వీక్‌లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన అత్యంత వేగవంతమైన కన్నడ సినిమాగా మరో మైలురాయిని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

Kantara Chapter 1 | క‌లెక్ష‌న్ల సునామీ..

“బాక్సాఫీస్ వద్ద డివైన్ బ్లాక్ బస్టర్.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.509.25 కోట్ల కలెక్షన్లు! ప్రేక్షకుల ప్రేమకు మా కృతజ్ఞతలు,” అంటూ ప్రకటించారు మేకర్స్. ఓవర్సీస్‌లోనూ ‘కాంతార 1’ విధ్వంసం సృష్టిస్తుంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్‌లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ఇది నిలవగా, త్వరలోనే రూ.600 కోట్ల మార్క్ దాటి ఫస్ట్ ప్లేస్​లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022లో వచ్చిన హిట్ మూవీ ‘కాంతార’కి ఇది ప్రీక్వెల్ కాగా, రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ మూవీలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా స్వయంగా వహించారు.

రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా (Heroine Rukmini Vasanth) నటించగా, జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో దైవభూమి రహస్యాలు, పంజుర్లి, గుళిగ దైవ గణాల గాథలను అనుభూతితో చూపించారని ప్రేక్షకుల ప్రశంసలతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఈ సినిమా ఇంత ఘ‌న విజ‌యం సాధించడంతో రిష‌బ్ శెట్టి స్పందిస్తూ.. ఈ విజయం నాకు మరింత బాధ్యతను ఇచ్చింది. ఇంతగా ప్రేమించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. నేను ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్నాను అని రిషబ్ మీడియాతో వెల్లడించారు. మొత్తంగా చెప్పాలంటే, ‘కాంతార చాప్టర్ 1’ కేవలం ఒక సినిమా కాదు.. అది ఒక సంస్కృతి, ఒక నమ్మకం, ఒక భావోద్వేగం. ఈ విజయం చూస్తుంటే, సీక్వెల్‌లు ఇంకా ఎన్ని వ‌స్తాయో చూడాలి.

Related News