ePaper
More
    HomeసినిమాKannappa Review | క‌న్న‌ప్ప మూవీ రివ్యూ… మంచు విష్ణు ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

    Kannappa Review | క‌న్న‌ప్ప మూవీ రివ్యూ… మంచు విష్ణు ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kannappa Review | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్న‌ప్ప చిత్రం రూపొందింది. శివుడిపై తన భక్తిని, నిస్వార్థమైన ప్రేమని చూపించేందుకు తన రెండు కళ్లు అర్పించిన గొప్ప భక్తుడు క‌న్న‌ప్ప‌. ఆయ‌న గురించి తెలియ‌ని వారు లేరు. గ‌తంలో క‌న్న‌ప్ప‌(Kannappa)పై సూప‌ర్ హిట్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఆ చిత్రాలలో కన్నప్పలోని భక్తిరస కోణం మాత్రమే ఆవిష్కరించారు.. అయితే ఇప్పుడు ఆయనలోని యాక్షన్ యాంగిల్‌ని కూడా చూపించేందుకు మంచు విష్ణు అండ్ టీం ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కోసం 2014 నుంచి రీసెర్చ్​ చేసి 2025 జూన్ 27న మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంద‌నేది రివ్యూలో చూద్దాం.

    కథ:

    పార్వతీ పరమేశ్వరులు (అక్షయ్, కాజల్) కైలాసంలో కన్నప్ప గురించి మాట్లాడుకుంటారు. అయితే మ‌హాభార‌త యుద్ధం జ‌రిగిన త‌ర్వాత అర్జునుడు మోక్షం ద‌క్క‌క తిన్నడు (మంచు విష్ణు)గా ఓ గూడెంలో వేరే జ‌న్మ ఎత్తుతాడు. అయితే పుట్టినప్పటి నుంచి కూడా తిన్న‌డు నాస్తికుడిగానే ఉంటాడు. త‌ర్వాత ఆయ‌న శివ భ‌క్తుడిగా ఎలా మారాడు? పరమేశ్వరుడు (అక్షయ్ కుమార్) తిన్నడు జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడు ? నాస్తికుడు నుంచి ఆస్తికుడిగా మారిన తిన్నడు.. ఆ పరమేశ్వరుడికి తన రెండు కళ్లనే నైవేద్యంగా ఇచ్చి కన్నప్పగా మార‌డానికి కార‌ణం ఏంటి? తిన్న‌డు జీవితంలో ఎలాంటి ప‌రిణామాటు చోటు చేసుకున్నాయి? తిన్న‌డుని భ‌క్తి మార్గంలో పయనించేలా చేయడానికి రుద్ర (ప్రభాస్) పాత్ర, మహదేవ శాస్త్రి (మోహన్ బాబు) పాత్ర‌, కిరాతక (మోహన్ లాల్) పాత్ర ఎలా దోహదం చేసాయ‌న్న‌దే క‌న్న‌ప్ప చిత్రం చూస్తే తెలుస్తుంది..

    Kannappa Review | న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

    కన్నప్పగా టైటిల్ రోల్​కు మంచు విష్ణు(Manchu Vishnu) పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్ర కోసం విష్ణు చాలా ఎఫ‌ర్ట్స్ పెట్టాడ‌ని సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ప్రీ క్లైమాక్స్, ప‌తాక స‌న్నివేశాల‌లో విష్ణు న‌ట‌న చాలా బాగుంది. ఇక ప్ర‌భాస్(Hero Prabhas) రుద్ర‌గా ఉన్న కొంచెం సేపు అయిన అద‌ర‌గొట్టాడు. కిరాతక పాత్రలో మోహన్ లాల్(Mohan Lal) కిరాతార్జునీయం ఎపిసోడ్​లో ఎంతో మెప్పించారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పార్వతి పరమేశ్వరులుగా ప‌ర్వాలేద‌నిపించారు. ఇక మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు జీవించాడు అనే చెప్పాలి. ఈ పాత్రకు ఆయన త‌ప్ప మ‌రొక‌రు సెట్ కారేమో అని అనిపించింది. విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త ఈ చిత్రంలో చిన్నప్పటి తిన్నడి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఇక ఓ పాటలో అరియాన, వివియనా కనిపించి అల‌రించారు. శరత్ కుమార్ సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా త‌మ త‌మ పాత్ర‌ల‌లో అల‌రించారు.

    Kannappa Review | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

    క‌థ‌ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Director Mukesh Kumar Singh) స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. మహాభారతం వంటి సూపర్ హిట్ సీరియల్ తీసిన అనుభవం కన్నప్పను తెరకెక్కించడానికి ముఖేష్‌కి బాగానే ఉపయోగపడింది అని చెప్పవచ్చు. దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ తనదైన శైలిలోతెర‌కెక్కించి అద‌ర‌హో అనిపించాడు.. నిర్మాణ విలువలు కూడా గ్రాండియర్ గానే ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల తప్పించి మిగ‌తా అంతా బాగుంది. మ్యూజిక్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా రొటిన్ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతున్న ‘కన్పప్ప’ సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ అయితే ఇస్తుంది.

    Kannappa Review | ప్లస్ పాయింట్స్

    కన్నప్ప కథ
    ప్రభాస్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరియన్స్
    ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
    నిర్మాణ విలువలు

    మైనస్ పాయింట్స్

    ఫస్ట్ హాఫ్ లో కొంత భాగం
    లాజిక్ లేని సీన్స్

    నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, ముఖేష్ ఋషి, శివ బాలాజీ, కౌశల్ మంద, బ్రహ్మానందం, సప్తగిరి, మాస్టర్ అవ్రామ్ భక్త తదితరులు

    సంగీతం: స్టీఫెన్ దేవస్సీ

    సినిమాటోగ్రఫీ: షెల్డాన్ చావ్

    ఎడిటర్: ఆంటోని
    బ్యానర్ అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్

    నిర్మాత: మోహన్ బాబు

    దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్

    విశ్లేష‌ణ:

    క‌న్న‌ప్ప చిత్రం దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్క‌గా, ఈ సినిమా మొదలైనప్పుడు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ చిత్రంపై నెగెటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేశారు. కానీ వెండితెర మీద ఈ చిత్రం అద‌ర‌గొట్టింది. కాళహస్తికి సంబంధించిన వాయులింగం కోసం గిరిజన తెగలు ఎలా పోరాటం చేశార‌నే ఎపిసోడ్​ను థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్(Theatrical Experience) కోసం సినిమాలో పెట్టినట్టు అనిపిస్తుంది. అది కూడా బాగుంది. కన్నప్ప నాస్తికుడిగా ఎంత మొరటుగా ఉండేవాడనేది చూపించ‌డం బాగుంది. ప్ర‌భాస్ రోల్ చిత్రానికి చాలా కీల‌కం. ఇంటర్వెల్ తర్వాత దాదాపు అరగంట వరకు ఉన్న ప్రభాస్ సినిమాను అలా పైన నిలబెట్టాడు. ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులు భక్తిలో లీనమయ్యేలా చేయ‌డంలో దర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఇంత‌క ముందు వ‌చ్చిన క‌న్న‌ప్ప చిత్రాలు చూసిన వారికి ఇది అంత‌గా అనిపించ‌క‌పోవ‌చ్చేమో కానీ నేటి త‌రం వారికి ఈ క‌న్న‌ప్ప బాగా నచ్చుతుంది.

    రేటింగ్: 2.75/5

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...