అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kannappa movie | మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం (Kannappa movie) జూన్ 27న విడుదల కానుంది. కాగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
కన్నప్ప చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మోహన్ బాబు (Mohan babu) మాట్లాడుతూ.. “ఇదంతా భగవంతుని ఆశీస్సులు. ప్రతి కదలిక ఆయన నిర్ణయమే. మనం నిమిత్తమాత్రులం. మంచి చిత్రాన్ని తీశాం, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకు ఉండాలి” అని కోరారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, “2014లో ‘కన్నప్ప’ కథ హక్కులు పొందాను. ఆ తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. శివుడి అనుగ్రహం వల్లే ఇంతమంది గొప్ప నటులు ఈ చిత్రంలో భాగమయ్యారని నమ్ముతున్నాను. ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ సమయంలో చూసి, ‘ఇలాంటి చిత్రాన్ని నేను చేయగలిగానా?’ అని ఆశ్చర్యపోయాను” అని అన్నారు.
Kannappa movie | ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
శరత్ కుమార్ (Sharat Kumar) తనకు తండ్రితో సమానమని, ఆయన వల్లే తమిళంలో ఈ సినిమా భారీగా విడుదలవుతోందని, న్యూజిలాండ్ (New Zealand) చిత్రీకరణలో కూడా ఆయన సహాయం మరువలేనిదని పేర్కొన్నారు. ‘తెలుగు తెరపై కన్నప్ప కనిపించి దాదాపు 50 ఏళ్లు అయింది. ఈ తరానికి వాయులింగం, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నన్ను ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతో ఈ చిత్రాన్ని తీస్తున్నా’ అని ఆయనతో చెప్పాను..” అంటూ విష్ణు తన మనోగతాన్ని పంచుకున్నారు. గత రెండున్నరేళ్లుగా హైదరాబాద్(Hyderabad) నా సొంత ఇల్లుగా మారిపోయింది. మోహన్ బాబు గారి వల్లే ఇక్కడికి వచ్చాను. ఆయన ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్. ఈ సినిమాలో ఏ పాత్ర కూడా అతిథిలా వచ్చి వెళ్లేది కాదు. ప్రభాస్(Prabhas) రెబల్ స్టార్ మాత్రమే కాదు, హంబుల్ స్టార్ కూడా దర్శకుడు ముకేష్ అన్నారు.
నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.. శివాజ్ఞతోనే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. మోహన్ బాబు నాకు అన్నయ్య లాంటి వారు, విష్ణు నా కుమారుడి లాంటి వాడు. వారి వల్లే ‘కన్నప్ప’ సాధ్యమైంది. నేటి యువతలో దేవుడిపై విశ్వాసం తగ్గుతోంది. దయచేసి నెగెటివ్ ప్రచారం చేయొద్దు. సినిమా కోసం పడిన కష్టాన్ని చూడండి అని విజ్ఞప్తి చేశారు.
ఇక ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ నవ్వులు పూయించారు. సుమ అడిగిన పలు ప్రశ్నలకు బ్రహ్మానందం ఫన్నీగా జవాబిచ్చారు. “మోహన్ బాబు, విష్ణు.. ఇద్దరిలో ఎవరు అందగాడు?” అని సుమ ప్రశ్నించగా.. “విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్” అని బ్రహ్మానందం అన్నారు.
మోహన్ బాబు సినిమాను మీరు రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారు?” అన్న ప్రశ్నకు, “‘అసెంబ్లీ రౌడీ’. ఆ సినిమా కోసం ముందుగా నన్నే సంప్రదించారు. ఆ సబ్జెక్ట్ మనకెందుకులే అనుకుని తిరస్కరించా. ‘నాకు ఆ అవకాశం కల్పించండి’ అని మోహన్ బాబు మా ఇంటికొచ్చి ప్రాధేయపడితే ఇచ్చేశా” అంటూ సరదాగా వ్యాఖ్యానించి నవ్వించారు. మోహన్ బాబులో మీకు నచ్చే, నచ్చని విషయాలు ఏంటి?” అని సుమ ప్రశ్నించగా.. “నచ్చేది, నచ్చనిది రెండూ లేవు. అసలు నాకు మోహన్ బాబే నచ్చడు” అంటూ బ్రహ్మానందం సరదాగా చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సినిమా ఆలోచన పరమేశ్వరుడిదని, ప్రజల్లో భక్తి సన్నగిల్లుతున్న ఈ తరుణంలో సాక్షాత్తూ శివుడే ‘నా సినిమా తీయ్’ అని మోహన్ బాబుకు చెప్పి ఉంటారని బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ (Prabhas) గురించి మాట్లాడుతూ.. డబ్బు కోసమో, అద్భుతమైన పాత్ర కోసమో కాకుండా, కేవలం మానవతా విలువలతో, మోహన్ బాబుపై ఉన్న అభిమానంతోనే ఈ సినిమా చేశారని కొనియాడారు.