ePaper
More
    HomeసినిమాKannappa | బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచారంటూ ట్రోల్స్.. ఎట్టకేల‌కు స్పందించిన క‌న్న‌ప్ప రైట‌ర్

    Kannappa | బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచారంటూ ట్రోల్స్.. ఎట్టకేల‌కు స్పందించిన క‌న్న‌ప్ప రైట‌ర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kannappa | టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ చిత్రంపై ఎంతో మంది భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఇటీవ‌ల మూవీకి సంబంధించి వ‌చ్చిన విమ‌ర్శ‌లు చిత్ర బృందాన్ని ఎంతో ఆవేద‌న‌కు గురి చేశాయి. మూవీపై పలు బ్రాహ్మణ సంఘాలు(Brahmin communities) అభ్యంతరం తెల‌ప‌డం మ‌నం చూశాం. సినిమాలో రెండు క్యారెక్టర్ల పేర్లు తమ మనోభావాలు దెబ్బ తీశాయని.. ఆ పేర్లను తొలగించకుంటే మూవీని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి. తాజాగా.. ఈ అంశంపై ‘కన్నప్ప’ రైటర్ ఆకెళ్ల శివప్రసాద్(Writer Akella Sivaprasad) స్పందించారు.

    Kannappa | వివాదంపై క్లారిటీ..

    ‘కన్నప్ప’కు మాటల రచయిత అయిన ‘ఆకెళ్ల శివ ప్రసాద్’ ఒక నోట్​ను రిలీజ్ చేశాడు. అందులో ‘నా పేరు శివ ప్రసాద్ ఆకెళ్ల. కన్నప్ప(Kannappa)కు మాటల రచయితగా పని చేశాను. కన్నప్ప మీద జరుగుతున్న దుష్ప్రచారం నన్ను చాలా బాధిస్తుంది. నేను బ్రాహ్మణుడిని, దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukeshkumar Singh)ఉత్తరాది బ్రాహ్మణుడు. మహాభారతాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకులు ఆయన. కన్నప్పలో బ్రాహ్మణుల్ని గాని, ఏ ఇతర కులాల వారిని గాని కించపరచలేదు. గతంలో కన్నప్ప జీవిత కథతో వచ్చిన కన్నడ కంఠీరవ ‘రాజ్ కుమార్’ గారి ‘శ్రీ కాళహస్తి మహత్యం’, రెబల్ స్టార్ ‘కృష్ణంరాజు’ గారు చేసిన ‘భక్త కన్నప్ప’లో కాళహస్తీశ్వరుడి గుడి ప్రధాన పూజారి మహాదేవ శాస్త్రి పాత్రని గుడిలో నగలు తీసుకెళ్లి తన ఉంపుడు గత్తెకి ఇవ్వడం చూపించారు.

    కానీ మంచు విష్ణు గారు ‘కన్నప్ప’కు కథా రచన కూడా చేసి మహాకవి ‘దూర్జటి'(Durjati) 16వ శతాబ్దంలో రచించిన ‘కాళహస్తి మహత్యం'(Kalahasti Mahathyam) గ్రంధం ఆధారంగా చేసుకొని ‘మహాదేవశాస్త్రి’ పాత్రని మహా శివభక్తుడిగా ఉన్నతంగా చూపించారు. ఈ క్యారక్టర్​ను మోహన్ బాబు గారు అత్యద్భుతంగా పోషించారు. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, పూర్తి చేశాక కూడా శ్రీ కాళహస్తి దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకులకు చూపించడం జరిగింది. చిత్రం ఎంతో ఉన్నతంగా ఉందని విష్ణు, మోహన్ బాబు(Mohan Babu)ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ చిత్రంలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రితో పాటు చాలా మంది బ్రాహ్మణులు వివిధ శాఖల్లో పని చేశారు. ఏ వర్గం వారిని కించపర్చడానికి కోట్లు కోట్లు పెట్టి సినిమాలు నిర్మించరు. కన్నప్ప ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు’ అని సదరు నోట్​లో పేర్కొన్నాడు.

    More like this

    September 8 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 8 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 8,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...