అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి కోర్టు నిరాకరించింది. మీరు మరింత మసాలా చల్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది.
న్యాయస్థానం సూచనలతో కంగనా తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. 2020–21లో జరిగిన రైతుల నిరసనలపై ఆమె చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. మహీందర్ కౌర్ ఫోటోతో కూడిన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన కంగనా.. షాహీన్ బాగ్ నిరసనలో పాల్గొన్న “బిల్కిస్ బానో దాది” అని పేర్కొంది. ఈ నేపథ్యంలో 73 ఏళ్ల మహిందర్ కౌర్ పంజాబ్‌లోని బతిండా కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కంగనా(Kangana Ranaut) తన పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది.
Supreme Court | విచారణకు నిరాకరణ..
తనపై పంజాబ్‌లో నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ కంగనా సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. తాను కేవలం రీట్వీట్ చేశానని పేర్కొంది. అయితే, ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విచారణ కొనసాగుతున్న ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆమె చేసిన ట్వీట్‌పైనా వ్యాఖ్యానించబోమని కోర్టు తెలిపింది. కంగనా పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించిన జస్టిస్ విక్రమ్ నాథ్ సందీప్ మెహతా(Justice Vikram Nath Sandeep Mehta)లతో కూడిన ధర్మాసనం.. ఉపసంహరించుకోవాలని సూచించింది. దీంతో కంగన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Supreme Court | మసాలా చల్లారని సుప్రీం ఆగ్రహం
విచారణ ప్రారంభం కాగానే జస్టిస్ సందీప్ మెహతా ట్వీట్ స్వభావాన్ని ప్రశ్నిస్తూ.. “మీ వ్యాఖ్యల సంగతేంటి? ఇది సాధారణ రీ-ట్వీట్ కాదు. మీరు మీ స్వంత వ్యాఖ్యలను జోడించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా న్యాయవాది ఆమె ఇప్పటికే వివరణ ఇచ్చిందని వాదించినప్పుడు, అటువంటి వివరణలను దిగువ కోర్టు ముందు చెప్పుకోవాలని సూచించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కావాలనుకుంటే కోర్టును అభ్యర్థించవచ్చని బెంచ్ తెలిపింది.
Supreme Court | కంగనా రనౌత్‌కు షాక్.. ఎంపీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు https://t.co/9efv6HuVyd#SupremeCourt #kangana #kanganaranaut #Bollywood #actress #bollywoodactress
— Akshara Today (@aksharatoday) September 12, 2025
