అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpally Road Accident | రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కమ్మర్పల్లి (Kammarpally) మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ప్రమాదం జరిగింది.
కమ్మర్పల్లి మండలం కేసీఆర్ కాలనీ (KCR Colony)కి చెందిన ఎర్రోళ్ల లస్మయ్య (75) తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై కమ్మర్పల్లికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యంలో జాతీయ రహదారి 63పై కేసీఆర్ కాలనీ కమాన్ సమీపంలో కారు ఢీకొంది. మోర్తాడ్ (Mortad) వైపు నుంచి కమ్మర్పల్లి వైపు వస్తున్న టాటా టిగోర్ కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వచ్చి లస్మయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లస్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి కుమార్తె ఎర్రోళ్ల వసంత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి (Armur Hospital) తరలించినట్లు కమ్మర్పల్లి ఎస్సై జి. అనిల్ రెడ్డి తెలిపారు.
