అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి మంగళవారం బీజేపీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) ఇన్ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోదీ (PM Modi), ఎంపీ అర్వింద్ (MP Arvind) పాలన పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సున్నం మోహన్, కార్యదర్శి బలరాం, బీజేవైఎం అధ్యక్షుడు కొత్తపల్లి గణేష్, బీజేపీ నాయకులు రెంజల్ల గంగాధర్, కొత్తపల్లి అరుణ్, చింత ప్రవీణ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.