అక్షరటుడే, కమ్మర్పల్లి : Gram Panchayat Elections | కమ్మర్పల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మండలంలో 14 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు (Sarpanch Elections) జరుగుతుండగా.. ఆయా పార్టీల మద్దతుదారుల మధ్య పోటీ ఉత్కంఠగా మారింది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకుని ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుని పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతోంది. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు చురుకుగా పనిచేస్తోంది. దీంతో కమ్మర్పల్లి మండలంలో (Kammarpalli) రాజకీయం రసవత్తరంగా మారింది. చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ జీపీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంకెట రవి వ్యూహాత్మకంగా వ్యవహరించి వినీల ప్రదీప్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకొని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ కొత్తపల్లి హారిక అశోక్‌ను పోటీలో నిలుపగా.. బీజేపీ తరపున భోగ మధులత రామస్వామి, స్వతంత్ర అభ్యర్థిగా అనిత రవీందర్ పోటీ చేస్తున్నారు.