అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy MLA Warning | అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి తప్పుడు సంతకాలు చేయవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డిలో (Kamareddy) పాలవర్గం ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు.
Kamareddy MLA Warning | అవినీతిని అంతం చేయడమే లక్ష్యం..
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Municipal Chairman Election) ఎలా జరిగిందో ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మున్సిపాలిటీలో అవినీతి లేకుండా చేశానన్నారు. మరో మూడేళ్లు కూడా ఇదే రీతిలో ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఎక్కడైనా అవినీతి కనిపిస్తే తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఒత్తిళ్లకు తలొగ్గొద్దు..
ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తప్పుడు సంతకాలు చేస్తే ఊరుకునేది లేదని కేవీఆర్ హెచ్చరించారు. అధికారులు నిబంధనల ప్రకారమే పనిచేయాలని సూచించారు. ప్రజాతీర్పును తాము శిరసావహిస్తామని, భవిష్యత్తులో అవతల పార్టీ వాళ్లు ఎలా ఉంటారో తెలియదన్నారు. మున్సిపాలిటీలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.