అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy youth | కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు తిరుపతి Tirupati రైల్వే స్టేషన్ Railway Station బ్రిడ్జి కింద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతుడు రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన తమ్మనగారి సతీష్‌గా అక్కడి రైల్వే పోలీసులు గుర్తించి కామారెడ్డి రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
రెండు రోజుల క్రితం తిరుపతిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kamareddy youth | మృతదేహంపై ఆనవాళ్లు..
మృతుని మెడపై గాట్లు, గొంతు, కడుపుపై పొడిచిన ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైనా హత్య చేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం.
ఆర్గొండ గ్రామానికి చెందిన సతీష్ కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. సతీష్‌కు పెళ్లైంది. సతీష్ కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పార్ట్నర్ గా ఉంటూ అదే పాఠశాలలో పీఈటీ PET గా పని చేస్తున్నాడు.
కాగా కొద్దిరోజులుగా పాఠశాలకు కూడా సరిగా వెళ్లడం లేదని తెలిసింది. అయితే వ్యక్తిగతంగా సతీష్ మంచి వ్యక్తి అని, ఎవరిని నొప్పించేవాడు కాదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు.
హత్య చేసేంత శత్రువులు ఎవరున్నారు.. అనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
