అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Yellow Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి (Kamareddy), కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, వికారాబాద్, నిజామాబాద్ (Nizamabad), సంగారెడ్డి జిల్లాల్లో రానున్న రెండు మూడు గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Kamareddy Yellow Alert | హైదరాబాద్ వాతావరణ శాఖ..
ఈ మేరకు హైదరాబాద్ బేగంపేట వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో గత అరగంట నుంచి ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ (Meteorological Department) సమాచారం ప్రకారం మరో రెండు గంటల పాటు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Kamareddy Yellow Alert | అల్పపీడనం నేపథ్యంలో..
అల్పపీడనం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమయ్యారు. బోధన్ నియోజకవర్గం (Bodhan Constituency)లోని సాలూర తదితర ప్రాంతాల్లో సుమారు 3వేల ఎకరాలకు పైగా శనగపంట సాగు చేశారు. కోతలు పూర్తయ్యి పంటలను ఆరబెట్టిన క్రమంలో సోమవారం ఉదయం కురుసిన వర్షానికి పంట తడిసిపోయింది. వాతావరణ శాఖ ముందుస్తుగా వర్షాలు పడతాయని హెచ్చరించడంతో రైతులు అప్రమత్తమయ్యారు
