అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Votes Counting | జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోడౌన్లో (AMC Godown) ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్నిగురువారం ఆయన కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (Kamareddy Sub-Division ASP Chaitanya Reddy), అదనపు కలెక్టర్లతో కలిసి పరిశీలించారు.
Kamareddy Votes Counting | బాధ్యతగా వ్యవహరించాలి..
ఎన్నికల నిర్వహణలో భాగంగా సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో (Bichkunda Municipality) ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నాలుగు మున్సిపాలిటీలలో కౌంటింగ్ సిబ్బంది 89 మంది సూపర్వైజర్లు, 178 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించామన్నారు.
కామారెడ్డి కౌంటింగ్ సెంటర్లో..
కామారెడ్డి ఎన్నికల కౌంటింగ్ కోసం 38 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 114 మంది కౌంటింగ్ సహాయకులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. 49 వార్డులలో రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని, మొదటి రౌండ్లో 32, రెండవ రౌండ్లో 17 వార్డుల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతకు ముందు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించి మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్, ఆర్డీవో వీణ, తహశీల్దార్లు, సీపీవో తదితరులు పాల్గొన్నారు.