అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vice Chairman Felicitation | కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipality) వైస్ ఛైర్మన్గా కాసర్ల గోదావరి స్వామి (Vice Chairman Kamareddy) ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం రాత్రి విశ్వకర్మ సంఘం (Vishwakarma Sangham) దేవి విహార్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.
Kamareddy Vice Chairman Felicitation | గెలుపునకు సహకరించిన వారికి కృతజ్ఞతలు..
ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ గోదావరి స్వామి (Godavari Swamy) మాట్లాడుతూ.. తమ గెలుపునకు సహకరించిన సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు అండగా నిలిచినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం దేవి విహార్ అధ్యక్షుడు వడ్ల భీమయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి కృష్ణమోహన్, హన్మాండ్లు, రామానంద్, రవికుమార్, రాజు, చంద్రశేఖర్, బ్రహ్మం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.